logo

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

పోలీసుస్టేషన్‌లకు సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశించారు.

Published : 07 Feb 2023 01:42 IST

బాధితుల ఫిర్యాదు పరిశీలిస్తున్న ఎస్పీ రిశాంత్‌రెడ్డి

చిత్తూరు (నేరవార్తలు): పోలీసుస్టేషన్‌లకు సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ఎస్పీ, ఏఎస్పీ జగదీష్‌ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆపై ఆయా స్టేషన్ల అధికారులతో జూమ్‌ సమావేశంలో మాట్లాడారు. స్థానికంగా ఫిర్యాదు ఇవ్వలేకనే చిత్తూరు వరకు వస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. భర్త వేధింపులు 4, కుటుంబ సమస్యలు 4, ఆస్తి తగాదాలు 5, మోసాలు 2 చొప్పున మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించి వారంలోగా తనకు నివేదించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐలు నీలకంఠేశ్వరరెడ్డి, మధు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని