logo

వేపగుంటలో రూ.6 లక్షల సొత్తు చోరీ

గ్రామీణ మండల పరిధిలోని వేపగుంటలోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ.6లక్షల విలువైన బంగారం, నగదు, చీరలు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Published : 07 Feb 2023 01:42 IST

చిందర వందర చేసిన దృశ్యం

పుత్తూరు: గ్రామీణ మండల పరిధిలోని వేపగుంటలోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ.6లక్షల విలువైన బంగారం, నగదు, చీరలు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మునెమ్మ వ్యవసాయశాఖలో అటెండర్‌గా పనిచేస్తూ పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటోంది. గ్రామంలోని ఇంట్లో ఆమె తల్లి రాజేశ్వరి నివసిస్తోంది. 2 రోజుల కిందట రాజేశ్వరి కుమారై వద్దకు వచ్చింది. సోమవారం గ్రామస్థులు ఇంటి తలుపులు తెరిచి ఉన్న విషయాన్ని గుర్తించి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటిలోకి వెళ్లి చూడగా  దొంగలు 8 సవర్ల బంగారం, రూ.90వేలు, 25 చీరలు ఎత్తుకెళ్లినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని