logo

ఒక్కో ఏఈ పది విద్యుత్తు చౌర్యం కేసులు పెట్టాలి: ఎస్‌ఈ

అక్రమ విద్యుత్తు వాడకం పెరిగిందని, దీన్ని అరికట్టేందుకు ఒక్కో ఏఈ నెలకు పది విద్యుత్తు చౌర్యం కేసులు పెట్టాలని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి ఆదేశించారు.

Published : 07 Feb 2023 01:42 IST

ఇంజినీర్లతో సమీక్షిస్తున్న ఎస్‌ఈ కృష్ణారెడ్డి

చిత్తూరు(మిట్టూరు): అక్రమ విద్యుత్తు వాడకం పెరిగిందని, దీన్ని అరికట్టేందుకు ఒక్కో ఏఈ నెలకు పది విద్యుత్తు చౌర్యం కేసులు పెట్టాలని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక అర్బన్‌ డివిజన్‌ కార్యాలయంలో అర్బన్‌, రూరల్‌ డివిజన్ల ఇంజినీర్లతో సమీక్షించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు అక్రమ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. విద్యుత్తు బిల్లుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఈఈలు హరి, పద్మనాభపిళ్లై, డీఈలు శేషాద్రిరెడ్డి, జ్ఞానేశ్వర్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు