logo

ఏనుగుల సంరక్షణకు సహకరించండి

విద్యుత్‌ షాక్‌తో జిల్లాలో ఏనుగులు మృతి చెందుతున్నాయని, అలా జరగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు సహకరించాలని డీఎఫ్వో చైతన్యకుమార్‌రెడ్డి కోరారు.

Published : 07 Feb 2023 01:42 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ): విద్యుత్‌ షాక్‌తో జిల్లాలో ఏనుగులు మృతి చెందుతున్నాయని, అలా జరగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు సహకరించాలని డీఎఫ్వో చైతన్యకుమార్‌రెడ్డి కోరారు. సోమవారం అటవీశాఖ కార్యాలయంలో ఆయన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఈఈలతో సమావేశం నిర్వహించారు. అటవీ సమీప పొలాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలు, నియంత్రికలను ఢీకొని ఏనుగులు మరణిస్తున్నాయన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచె లేదని, బోరు మోటారు వైర్లకు కేబుల్స్‌ లేవని, అవి ఉంటే ఏనుగులు వాటిని కొరికినా ప్రమాదం జరగదన్నారు.ఏనుగులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు విద్యుత్‌ సరఫరా ఆపాలని అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. వాటికి తెలుపు రంగు నచ్చదని, విద్యుత్‌ స్తంభాలు, పైప్‌లైన్లకు పచ్చరంగు వేయాలన్నారు. ఏనుగులు అడవుల నుంచి బయటకు వచ్చి సంచరించే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించాలన్నారు.ఎఫ్‌ర్వోలు బాలకృష్ణారెడ్డి, థామస్‌, నయిం, మధన్‌మోహన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఈఈలు హరి, పద్మనాభపిళ్ల్లై, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని