logo

జల్లికట్టులో అపశ్రుతి

జల్లికట్టు తరహాలో నిర్వహించే పశువుల పండగలో అపశ్రుతి చోటుచేసుకుంది. రంకెలు వేస్తున్న కోడెను నిలువరిస్తున్న క్రమంలో అది కుమ్మడంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 08 Feb 2023 03:55 IST

ఎద్దు పొడవడంతో ఒకరి మృతి
ఐదుగురికి తీవ్రగాయాలు.. కేసు నమోదు

ఎద్దు దాడితో మృతిచెందిన శీనప్ప

వి.కోట, న్యూస్‌టుడే: జల్లికట్టు తరహాలో నిర్వహించే పశువుల పండగలో అపశ్రుతి చోటుచేసుకుంది. రంకెలు వేస్తున్న కోడెను నిలువరిస్తున్న క్రమంలో అది కుమ్మడంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం వెర్రినాగేపల్లె గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో కొడెల పరుగు పందెం నిర్వహించడంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి భారీగా పశువులు, ప్రజలు తరలివచ్చారు. చుట్టు పక్కల ప్రాంతాల వారు వచ్చారు. ఈ క్రమంలో మండల పరిధిలోని మోర్నపల్లె గ్రామానికి చెందిన శీనప్ప (54) ఎద్దులను తిలకించడానికి వచ్చారు. వీక్షిస్తున్న క్రమంలో ఓ ఎద్దు శీనప్పను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగ్రాతుడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. అక్కడే  గజేంద్ర, రమణ, మహేష్‌, రమణ, ఛాంద్‌బాషాలకు సైతం గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకొన్న పోలీసులు గ్రామానికి వెళ్లి అడ్డుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు.

వెర్రినాగేపల్లెలో జల్లికట్టు నిర్వహిస్తున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని