logo

వ్యసనాల మత్తులో చోరీలు

వారందరూ వ్యసనాలకు బానిసలయ్యారు.. ఆనక దొంగతనాలు మొదలుపెట్టారు.. చివరకు పోలీసులకు ఇట్టే దొరికిపోయారు..

Published : 08 Feb 2023 03:55 IST

ఇద్దరు బైకుల దొంగల అరెస్టు ‌
రూ.10లక్షల విలువైన వాహనాల స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రామరాజు, సీఐ లక్ష్మీనారాయణ

పుత్తూరు, న్యూస్‌టుడే: వారందరూ వ్యసనాలకు బానిసలయ్యారు.. ఆనక దొంగతనాలు మొదలుపెట్టారు.. చివరకు పోలీసులకు ఇట్టే దొరికిపోయారు.. మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.10లక్షల విలువైన 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామరాజు తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొద్దినెలలుగా పుత్తూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీ నేపథ్యంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి క్రైమ్‌ ఏఎస్పీ విమలకుమారి పర్యవేక్షణలో నిఘా పెట్టాం. మండలంలోని వేపగుంట క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ సమయంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాలు చోరీ చేశారని తేలింది. తమిళనాడు రాష్ట్రం అరక్కోణం తాలూకా పారంజి గ్రామానికి చెందిన మురుగమణి(38), తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరుపాళెం గ్రామానికి చెందిన బసవయ్య(39)ను అరెస్టు చేశాం. తమిళనాడు రాష్ట్రం రాణిపేటకు చెందిన శరత్‌ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించారని ఆయన చెప్పారు. ముద్దాయిలను పట్టుకున్న సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందిం చారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు వెంకటమోహన్‌, గౌరీశంకర్‌, ఏఎస్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, భరత్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని