logo

20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

పూతలపట్టు-నాయుడుపేట ఆరు వరుసల జాతీయ హదారిలోని గాజులపల్లె సమీపంలో మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో పూతలపట్టు పోలీసులు అక్రమంగా తరలిపోతున్న 20 టన్నుల రేషన్‌ బియ్యంతో పాటు ఇద్దరిని ఆదుపులోకి తీసుకున్నారు.

Published : 08 Feb 2023 03:43 IST

ఇద్దరి అరెస్టు

పూతలపట్టు, న్యూస్‌టుడే: పూతలపట్టు-నాయుడుపేట ఆరు వరుసల జాతీయ హదారిలోని గాజులపల్లె సమీపంలో మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో పూతలపట్టు పోలీసులు అక్రమంగా తరలిపోతున్న 20 టన్నుల రేషన్‌ బియ్యంతో పాటు ఇద్దరిని ఆదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హరిప్రసాద్‌ వివరాల మేరకు సీఐ ఆశీర్వాదం తమకిచ్చిన రహస్య సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కర్ణాటకకు చెందిన బియ్యం పట్టుబడినట్టు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదుపులోకి తీసుకున్న లారీ డ్రైవర్‌ దామోదరం, క్లీనర్‌ కృష్ణను విచారించగా నగరి నుంచి బెంగళూరుకు బియ్యాన్ని తరలిస్తున్నట్టు తెలిపారు. లారీ యజమాని తులసీరాంపైనా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు