logo

ఎస్‌ఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డీ2 ప్రయోగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన అనుసంధానం మంగళవారం పూర్తయింది.

Published : 08 Feb 2023 03:50 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డీ2 ప్రయోగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన అనుసంధానం మంగళవారం పూర్తయింది. బుధవారం ఇస్రో అధిపతి సోమనాథ్‌ ఇక్కడికి రానున్నారు. ఉదయం వాహన నౌకను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన పిదప మధ్యాహ్నం రాకెట్‌ సన్నద్ధత సమావేశం జరగనుంది. గురువారం ఉదయం రిహార్సల్స్‌ పూర్తయ్యాక మరోసారి శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహిస్తారు. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) ఆమోదం తర్వాత  శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈవోస్‌-07 భూ పరిశీలన ఉపగ్రహంతోపాటు మారో రెండు పేలోడ్‌లను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు