logo

ఉపాధి పనుల్లో అక్రమాల గుర్తింపు

ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడితే ఉద్యోగాలు ఊడుతాయని పీడీ శ్రీనివాస ప్రసాద్‌ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Published : 08 Feb 2023 03:55 IST

అవకతవకలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్న పీడీ శ్రీనివాస ప్రసాద్‌

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఉపాధి సిబ్బంది అవకతవకలకు పాల్పడితే ఉద్యోగాలు ఊడుతాయని పీడీ శ్రీనివాస ప్రసాద్‌ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమ్మపాళెం, కలపాడు, సోమసానిగుంట పంచాయతీల పరిధిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అమ్మపాళెం క్షేత్ర సహాయకుడు, సోమసానిగుంట పంచాయతీ పరిధిలో మృతి చెందినవారి పేరున నిధులు స్వాహా చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సోమసానిగుంట పంచాయతీ పరిధిలో అనేక అక్రమాలు జరిగాయని మాజీ సర్పంచి తిరుమల ఫిర్యాదు చేయడంతో మరోసారి సమగ్రంగా విచారణ చేపట్టాలని పీడీ ఆదేశించారు. మొత్తం రూ.18 కోట్ల విలువైన పనులు చేయగా రూ.1.64 లక్షల రికవరీకి ఆదేశించామన్నారు. జిల్లా విజిలెన్స్‌ అధికారి భాగ్యలక్ష్మి, ఏపీడీ ప్రేమ్‌కుమార్‌, ఎంపీపీ తనూజారెడ్డి, ఎంపీడీవో కోటేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని