logo

రాగిమానుకుంటలో చిరుత సంచారం

ఆరేపల్లి రంగంపేట పంచాయతీలోని రాగిమానుకుంట ప్రాంతంలో మంగళవారం రాత్రి చిరుతపులి ఓ మేక పై దాడి చేసింది.

Published : 08 Feb 2023 03:55 IST

మేకపై దాడి చేసిన వన్యమృగం
భయాందోళనలో రైతులు


బాణసంచా కాల్చుతున్న అటవీశాఖ సిబ్బంది

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: ఆరేపల్లి రంగంపేట పంచాయతీలోని రాగిమానుకుంట ప్రాంతంలో మంగళవారం రాత్రి చిరుతపులి ఓ మేక పై దాడి చేసింది. ఇతర మేకలు అరవడంతో స్పందిం చిన గ్రామస్థులు కేకలు వేయడంతో మేకను వదిలి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత వచ్చివెళ్లిన మార్గాలను అన్వేషించి దాని పాదముద్రలను గుర్తించారు. ఆ ప్రాంతంలోని రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గాయపడ్డ మేక, చిరుత పాదముద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు