ప్లాట్లు.. పాట్లు
పుత్తూరు పట్టణంలోని వేదవ్యాస పాఠశాల సమీప వీధిలో 20మంది ఇంటి నిర్మాణాలు పూర్తిచేశారు. దశల వారీగా అక్కడ ఇళ్లొస్తున్నాయి. వారు చేసిన తప్పిందమంతా అనధికార లేఅవుట్‌లో ప్లాటు కొనడమే.
సౌకర్యాలపై దృష్టిపెట్టని పురపాలిక
అవస్థల్లో కాలనీలవాసులు
న్యూస్‌టుడే, పుత్తూరు
వేదవ్యాస పాఠశాల సమీప వీధిలో డ్రైనేజీ లేని దృశ్యం
* పుత్తూరు పట్టణంలోని వేదవ్యాస పాఠశాల సమీప వీధిలో 20మంది ఇంటి నిర్మాణాలు పూర్తిచేశారు. దశల వారీగా అక్కడ ఇళ్లొస్తున్నాయి. వారు చేసిన తప్పిందమంతా అనధికార లేఅవుట్‌లో ప్లాటు కొనడమే. మౌలిక వసతుల కల్పనకు వారి నుంచి 14శాతం పన్ను చొప్పున ఇప్పటికి రూ.25లక్షలు వసూలు చేశారు. ఇక అంతే.. ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు ఒక్క సౌకర్యమూ కల్పించలేదు.
* పట్టణంలోని శివసాయినగర్‌లో కనీసం రోడ్లు నిర్మించకపోవడం కాలనీవాసులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. వర్షం వచ్చిందంటే అగచాట్లే. తాము మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా తమ గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. భవన అనుమతుల కోసం వసూలు చేస్తున్న నిధులు ఆయా ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఈ ప్రాంతాలను వదిలేసి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే నిధులు ఖర్చు చేస్తుంటడం గమనార్హం.
అనధికార లేఅవుట్లలో కొన్న ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతి తీసుకోవాలంటే అభివృద్ధి ఛార్జీల కింద మున్సిపల్‌శాఖకు డాక్యుమెంట్ విలువలో 14శాతం చెల్లించాలి. ఈ లెక్కన ఏటా రూ.కోట్లు మున్సిపల్ ఖజానాకు ఆదాయం వస్తోంది. భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నాక అక్కడ ఇళ్లు నిర్మించాలంటే బోరు తప్పక వేయాలి. దానికి విద్యుత్తు కనెక్షన్ తీసుకోవాలి. ఆ వీధిలో విద్యుత్తు పోల్స్ లేకుంటే మున్సిపాలిటీయే.. విద్యుత్తుశాఖకు దానికయ్యే మొత్తాన్ని చెల్లించి లైన్లు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు మిన్నకుంటున్నారు. దీంతో భవన యజమాని రూ.వేలకు వేలు చెల్లించి విద్యుత్తు సౌకర్యం పొందాల్సి రావడం మరింత భారంగా మారింది.
శివసాయి నగర్‌లో కనీసం రోడ్డు వేయని దృశ్యం
పుత్తూరులో 13,500 నివాసాలు, 60వేల పైచిలుకు జనాభా ఉన్నారు. ఏటా 150 నుంచి 200 మంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకుంటున్నారు. ఇళ్ల అనుమతి పారదర్శకంగా ఇవ్వాలని రాష్ట్రంలో తెదేపా హయాంలో ఆన్‌లైన్‌లోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి వివరాలు పంపితే అనుమతి కోసం ఎంత చెల్లించాలో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుదారుకు సంక్షిప్త సమాచారం వస్తుంది. మీసేవలో పైకం చెల్లించిన వెంటనే అనుమతులు వచ్చేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఇది పారదర్శకంగా ఉంది. అనధికార లేఅవుట్‌లో భవన యజమాని నుంచి 14శాతం పన్ను వసూలు చేసి సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవ డంతో ఆ భారాన్ని ప్రజలే భరిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే అది తమ పరిధిలో లేదని తప్పుకొంటున్నారు. మున్సిపాలిటీకి అభివృద్ధి ఛార్జీలు, విద్యుత్తు పోల్స్‌కు ఫీజు చెల్లించాల్సి వస్తోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. మున్సిపాలిటీలోని 35 అనధికార లేఅవుట్లలో ఒక్కదానికే తుడా అనుమతి ఉంది. మిగిలిన వాటిలో కొన్నవారు అవస్థలు పడుతున్నారు.
దశల వారీగా సౌకర్యాలు..
-కేఎల్‌ఎన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీలోని కొత్త కాలనీల్లో దశల వారీగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని వసతులు మున్సిపాలిటీనే కల్పించాలి. వసూలవుతున్న పన్నులు జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్తు ఛార్జీలకే చాలడం లేదు. భవన అనుమతుల కోసం వచ్చిన నగదు అన్ని వార్డుల్లో ఖర్చు చేస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!