logo

మరో 63 చోట్ల రిజిస్ట్రేషన్లు

రెండో ధపాలో మరో 63 సచివాలయాల పరిధిలో స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణకు స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ సన్నద్ధమవుతోంది..

Published : 08 Feb 2023 04:03 IST

126 గ్రామాల ఎంపిక
శిక్షణ పూర్తయ్యాక సేవలు ప్రారంభం

గ్రామ సచివాలయం

న్యూస్‌టుడే, చిత్తూరు(సంతపేట): రెండో ధపాలో మరో 63 సచివాలయాల పరిధిలో స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణకు స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ సన్నద్ధమవుతోంది.. సమగ్ర భూ రీసర్వే పూర్తయిన సచివాలయాల పరిధిలోని 126 గ్రామాలకు సంబంధించి సేవల్ని ఇకపై.. సచివాలయ స్థాయిలోనే నిర్వహించుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు.. సచివాలయ అడ్మిన్‌ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణను ఇవ్వనున్నారు.. సచివాలయాల వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తయ్యాక.. అతి త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు.

ఎల్‌పీఎం సంఖ్య ఆధారంగా..

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూములకు ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాపింగ్‌(ఎల్‌పీఎం) సంఖ్యలు కేటాయించారు. వీటి ఆధారంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రీసర్వే పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన నాలుగు సచివాలయాల పరిధిలో ఇప్పటికే సేవల్ని అందిస్తున్నారు. తాజాగా మరో 63 సచివాలయాలు ఈ జాబితాలో చేరాయి. మరోవైపున.. రిజిస్ట్రేషన్లను క్రయవిక్రయదారులు సచివాలయాల్లోనే చేసుకోవాలనే షరతు లేదు. తమ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోనూ చేసుకునేందుకు సమాంతరంగా అవకాశాలు కల్పించారు. చిత్తూరు, గుడిపాల, పెనుమూరు, పూతలపట్టు, తవణంపల్లె, గుడిపల్లె, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి, వి.కోట, సదుం మండలాల పరిధిలోని మొత్తం 63 సచివాలయాల్లో సేవల్ని త్వరలో అందించనున్నారు.


సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి..
-శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై అడ్మిన్‌ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. 136 మందికి శిక్షణను అందించనున్నాం. రిజిస్ట్రేషన్లతో పాటు ఈసీ ఇతర ధ్రువపత్రాలకు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని