logo

ఏపీవీవీపీ సేవలకు గుర్తింపు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరు ఆసుపత్రులు రాష్ట్రస్థాయిలో  ఉత్తమ సేవలతో మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Published : 21 Mar 2023 02:52 IST

ఉమ్మడి జిల్లాలో ఆరు ర్యాంకులు

చిత్తూరు(వైద్యవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరు ఆసుపత్రులు రాష్ట్రస్థాయిలో  ఉత్తమ సేవలతో మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయని ఉన్నతాధికారులు ప్రశంసించారు. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు గుర్తించి ప్రోత్సహించి ర్యాంకులు ప్రకటించారు. ఏప్రిల్‌ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఏపీవీవీపీ ఆస్పత్రుల పనితీరు పరిశీలించి.. ఉమ్మడి జిల్లాలోని 24 ఆస్పత్రుల్లో మంచి సేవలు అందుతున్నట్లు తేల్చారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఓపీలు 3.25 లక్షలు, ఐపీలు 3.18 లక్షలు, మేజర్‌ శస్త్రచికిత్సలు 8,014, ట్యుబెక్టమీ 6,605, ప్రసవాలు 15,283, ఎక్స్‌రేలు 1.20 లక్షలు, అల్ట్రా సోనోగ్రామ్‌ స్కానింగ్‌ 84,588, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ 1.04 లక్షలు, ల్యాబ్‌ పరీక్షలు 29.33 లక్షల మందికి చేసినట్లు గుర్తించారు. ర్యాంకులు వరుసగా మదనపల్లె, చిత్తూరు జిల్లా ఆస్పత్రులు, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కుప్పం ఆసుపత్రులకు వచ్చాయి. ఈ సందర్భంగా  ఆయా ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిని డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌ అభినందించారు. ః  24 ఆస్పత్రుల్లో 11 ఆస్పత్రులకు ఏ-గ్రేడు, 10 ఆస్పత్రులకు బీ-గ్రేడు, కార్వేటినగరం, పెనుమూరు, మహల్‌ ఆస్పత్రులకు సీ-గ్రేడ్‌ ప్రకటించారు. సీ-గ్రేడ్‌ ఉన్న ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపరచాలని సూచించారు.


రేపు స్విమ్స్‌ ఓటీ, ఓపీలకు సెలవు

తిరుపతి(స్విమ్స్‌): ఉగాది సందర్భంగా బుధవారం స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని