logo

45 ఏళ్లు నిండిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏటా పరీక్షలు

‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 45 సంవత్సరాలు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఉద్యోగులు రోజువారీ వ్యాయామంతోపాటు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది’ అని మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్లు గుణ మాధురి, సందీప్‌ కృష్ణ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 02:54 IST

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 45 సంవత్సరాలు దాటిన వారికి ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఉద్యోగులు రోజువారీ వ్యాయామంతోపాటు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది’ అని మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్లు గుణ మాధురి, సందీప్‌ కృష్ణ పేర్కొన్నారు. తిరుపతి ఆర్టీసీలోని డిస్పెన్సరీ ద్వారా జిల్లా పరిధిలోని 8 డిపోల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్న గుణ మాధురి, సందీప్‌ కృష్ణ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. డిస్పెన్సరీలో రోజుకు 90 నుంచి 100 మంది వరకు ఉద్యోగులకు, నెలకు 900 మంది విశ్రాంత ఉద్యోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మధుమేహం ఉన్నవారికి ఉచితంగా రక్తపరీక్షలు అందించి నెలకు సరిపడా మందులు అందిస్తామని తెలిపారు. గుండె, కిడ్నీ సంబంధిత ఇతర వ్యాధులతో బాధపడే వారికి అవసరమైన మందులను వైద్యుల సూచనల మేరకు నెలవారీ మందులు అందిస్తామని చెప్పారు. విశ్రాంత ఉద్యోగులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలకు స్విమ్స్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తామని, ఈహెచ్‌ఎస్‌ ద్వారా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని