బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వాలంటీరు అరెస్టు
బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నందనం గ్రామ వాలంటీరు మధురెడ్డి(29)ని అరెస్టు చేసినట్లు సీఐ శివకుమార్‌రెడ్డి తెలిపారు.
నాగలాపురం, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నందనం గ్రామ వాలంటీరు మధురెడ్డి(29)ని అరెస్టు చేసినట్లు సీఐ శివకుమార్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగలాపురం మండలంలోని నందనం గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక(14)ను అమ్మఒడి పథకానికి సంబంధించి ఆధార్‌కార్డు నకలును తీసుకురావాల్సిందిగా నిందితుడు ఆదివారం మధ్యాహ్నం అడిగాడన్నారు. నకలును తీసుకురావడానికి బాలిక పూజగదిలోకి వెళ్లిన సమయంలో నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడన్నారు. అనంతరం బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో పరారయ్యాడన్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని ఆదివారం రాత్రి 9 గంటలకు అరెస్టు చేశామన్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై హనుమంతప్ప పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు/స్ట్రోక్ కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం