logo

శేషుడిపై కోదండరాముడి చిద్విలాసం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.

Published : 21 Mar 2023 03:02 IST

ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు

తిరుపతి(విద్య): తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. అనంతరం ఆస్థానం, స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. రాత్రికి పెద్దశేషునిపై శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరి ఊరేగారు. మంగళవారం చిన్నశేష, హంస వాహన సేవలు జరగనున్నాయి. జేఈవో వీరబ్రహ్మం, శ్రీ పెద్దజీయ్యంగారు, శ్రీ చిన్నజీయ్యంగారు, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్‌, సూపరింటెండెంట్ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్‌, అర్చకులు ఆనంద కుమార్‌ దీక్షితులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని