logo

వైద్య విద్య పటిష్ఠతతోనే నాణ్యమైన సేవలు

రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందాలంటే వైద్య విద్య పటిష్ఠత ఆవశ్యమని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 03:02 IST

డీఎంఈ వినోద్‌కుమార్‌

తనిఖీలు నిర్వహిస్తున్న డీఎంఈ వినోద్‌కుమార్‌

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందాలంటే వైద్య విద్య పటిష్ఠత ఆవశ్యమని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విభాగాల వారీగా సమీక్షించారు. అనంతరం తనిఖీలు నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎస్వీ వైద్య కళాశాలకు పెద్దస్థాయిలో 83 పీజీ వైద్య విద్య సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేసింది. తద్వారా వచ్చే రూ.85 కోట్ల నిధులతో విద్యార్థుల విద్య, పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులు, అధునాతన పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు వార్డుల్లో రోగులకు అందుతున్న చికిత్సా విధానం (ఇంటర్న్‌షిప్‌)పై ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రొఫెసర్లు పర్యవేక్షణలో ఇంటర్న్‌షిప్‌ విధిగా జరిగేలా చర్యలు చేపట్టనున్నాం. ఎస్వీఎంసీలో సూపర్‌, సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాలు పూర్తిస్థాయిలో నెలకొల్పడం వల్లే వైద్య విద్య పటిష్టమవుతుంది. రుయాలో ఇటీవల జరిగిన ఆరోగ్య ఆసరా నిధుల దుర్వినియోగంలో సూత్రధారులపై దర్యాప్తు జరుగుతోంది. వైద్యుల సంతకాలు పోర్జరీ చేసిన ఘటన గురించి దర్యాప్తు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇ- హాస్పిటల్‌ వ్యవస్థ మెరుగు పరిచేందుకు అవసరమైన కంప్యూటర్ల కొనుగోలు చేసి.. సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం. రుయాకు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ నియామకం కోసం అన్వేషణ జరుగుతోంది’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని