logo

శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరోలు

శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో సినీ హీరోలు మంచు విష్ణు, విశ్వక్‌సేన్‌ దర్శించుకున్నారు.

Published : 21 Mar 2023 03:02 IST

ఆలయం ఎదుట విశ్వక్‌సేన్‌ తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో సినీ హీరోలు మంచు విష్ణు, విశ్వక్‌సేన్‌ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల హీరో విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ.. తాను నటించిన ప్రతి చిత్రం విడుదలకు ముందు కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఉగాది రోజున నూతనచిత్రం విడుదలవుతోందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో నూతన చిత్రం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీవారిని ఎమ్మెల్యేలు  కేతిరెడ్డి పెద్దారెడ్డి, కొడాలి నాని దర్శించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు