logo

‘ఎమ్మెల్యేలపై దాడి అమానుషం’

శాసనసభలో  స్పీకర్‌ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేయడం అమానుషమని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరరావు అన్నారు.

Updated : 21 Mar 2023 04:34 IST

కోటలో నల్ల రిబ్బన్లతో నినదిస్తూ..

వెంకటగిరి, న్యూస్‌టుడే : శాసనసభలో స్పీకర్‌ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేయడం అమానుషమని తెదేపా తిరుపతి పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరరావు అన్నారు. పట్టణంలోని క్రాస్‌రోడ్డు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలి ఫలితాలను జీర్ణించుకోలేని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తెదేపా ఎమ్మెల్యేలపై దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ దేవాలయం లాంటి శాసనసభలో దళిత ఎమ్మెల్యేపై దాడి చేయడం దారుణమన్నారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు చలపతి, ప్రసాద్‌, ఆనంద్‌, సుధాకర్‌, రవిచంద్ర, మురళి, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లకూరు : అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేల డ్రామా ప్రజలందరికీ అర్థమైందని తెదేపా నేత పేరం రమేష్‌ బాబు అన్నారు. కోడికత్తి డ్రామాను తలపించేలా తెదేపా ఎమ్మెల్యేపై దాడిచేసి కట్లు కట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సర్పంచి కందమూడి శివకుమార్‌, కాటూరు గోపాలరెడ్డిలు దాడిని ఖండించారు.

గూడూరు పట్టణం: ప్రజల దేవాలయంగా భావించే అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తూ, తెదేపా ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదిరిపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఇలాంటి దాడులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కోట : ఏపీ శాసన సభలో జరిగిన ఘటనను ఖండిస్తూ కోటలో తెదేపా నేతలు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మూడుచోట్ల గెలవడం జీర్ణించుకోలేక వైకాపా ఎమ్మెల్యేలు ఒత్తిడిలో ఉన్నారని, ఈక్రమంలోనే దాడి చేశారని విమర్శించారు. జలీల్‌ అహ్మద్‌, తీగల సురేష్‌బాబు, మధుయాదవ్‌, షంషుద్దీన్‌, సురేష్‌, నౌషాద్‌, నాయబ్‌, బాబు, మోహన్‌, వంశీ, చిన్నయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని