logo

పట్టుపడితే.. పసిడి పతకం

ఎటువంటి ఆయుధం లేకుండా తమను తాము రక్షించుకోవచ్చన్న ధీమా తైక్వాండోతో సాధ్యం. అందులో ప్రతిభ చూపి పతకాలు సాధించడం అంత సులువేం కాదు.

Published : 21 Mar 2023 03:07 IST

చిన్న వయసులోనే తైక్వాండోలో ప్రతిభ

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎటువంటి ఆయుధం లేకుండా తమను తాము రక్షించుకోవచ్చన్న ధీమా తైక్వాండోతో సాధ్యం. అందులో ప్రతిభ చూపి పతకాలు సాధించడం అంత సులువేం కాదు. అందులోనూ చిన్నారులకు మరింత కష్టతరం. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణతో ఓ బాలుడు జిల్లా స్థాయిలో సత్తాచాటి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నాడు. ఆ బాలుడే మూర్తేష్‌ సాయిసింగ్‌.
గూడూరు రెండో పట్టణం జానకీరామ్‌పేటకు చెందిన జశ్వంత్‌సింగ్‌, ఝాన్సీరాణిల కుమారుడు సాయిసింగ్‌. స్థానిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. చిన్న వయస్సు నుంచి చదువులో ముందుండటమే కాకుండా క్రీడారంగంలో రాణిస్తుండటంతో గూడూరు పట్టణంలోని సింహపురి స్పోర్ట్స్‌ అకాడమీలో నవీన్‌శంకర్‌ అనే మాస్టర్‌ తైక్వాండ్‌లో శిక్షణ అందిస్తున్నారని తెలుసుకొని అందులో చేర్పించారు. బాలుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ రావడంతో అనతికాలంలోనే సత్తాచాటి తైక్వాండో పోటీల్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయిలో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. యలమంచిలోని వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు.


జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం

తైక్వాండో క్రీడలో రాణించడం ఎంతో సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి శిక్షణ పొంది, బంగారు పతకాన్ని సాధించా. గురువు నవీన్‌ శంకర్‌ వద్ద శిక్షణ పొందా. అప్పుడే ప్రత్యర్థిని ఎలా ఓడించాలో తెలుసుకున్నా. తైక్వాండోలో బాగా రాణించి, జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం.
మూర్తేష్‌ సాయిసింగ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని