logo

సూళ్లూరుపేట జలమయం

సూళ్లూరుపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేకపోవడంతో నీరంతా రోడ్లపైనే నిలిచిపోయింది

Published : 21 Mar 2023 03:21 IST

సూళ్లూరుపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేకపోవడంతో నీరంతా రోడ్లపైనే నిలిచిపోయింది. ప్రధాన రోడ్డు (జీఎన్‌టీరోడ్డు)తోపాటు స్త్రీశక్తి భవన్‌, గాండ్ల వీధి, బాపూజీకాలనీ, శ్రీహరికోట రోడ్డు మొత్తం నీటితో మునిగిపోయాయి. మోకాలోతు నీటితో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. రెండు గంటలపాటు జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోనివారు సైతం బయటకు రాలేకపోయారు. పురపాలక కార్యాలయం చుట్టూ నీరు చేరింది. మురుగు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

న్యూస్‌టుడే, సూళ్లూరుపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు