logo

మామిడి పంటను రక్షించుకోండిలా

అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మామిడి పంటను రక్షించుకోవచ్చని సీనియర్‌ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 03:54 IST

తోటలు పరిశీలించిన సీనియర్‌ ఉద్యాన శాస్త్రవేత్త

బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెలో మామిడి తోటలు పరిశీలిస్తున్న ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి మధుసూదనరెడ్డి

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మామిడి పంటను రక్షించుకోవచ్చని సీనియర్‌ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మామిడి పంటను ఎలా రక్షించుకోవాలో తెలియజేసే నిమిత్తం సోమవారం చిత్తూరు గ్రామీణ, తవణంపల్లె, బంగారుపాళ్యం మండలాల్లో మామిడి తోటలు పరిశీలించి రైతుల సందేహాలు నివృత్తి చేశారు. తోటల్లో ముందుకు వచ్చిన పూత నుంచి పిందె శాతం ఎక్కువ ఉందని, ముందు పంట ఎప్పుడూ పురుగుల ఉద్ధృతి నుంచి రక్షింపబడుతుందన్నారు. దీన్ని రైతులు గుర్తించి వీలైనంత త్వరగా పూత రావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తామర, నల్లతామర పురుగులు, పచ్చపురుగులు ఆశించడంతో పాటు వర్షాలకు తేమ శాతం పెరిగి మచ్చ తెగులు రావడానికి అవకాశం ఉందన్నారు. దీని నివారణకు లీటరు నీటికి అసిఫెట్‌ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్‌ 2 మి.ల్లీలతో పాటు కార్బండిజమ్‌ ఒక గ్రాము, వేపనూనె(1500పీపీఎం) 2 మిల్లీలు కలిపి పిచికారీ చేయాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి మధుసూదనరెడ్డి, ఏరువాక శాస్త్రవేత్త రాఘవేంద్ర, ఉద్యాన అధికారులు హరికృష్ణారెడ్డి, సాగరిక, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని