logo

విద్యుదాఘాతంతో వృద్ధ రైతు మృతి

పంటకు నీరందించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వృద్ధ రైతు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పేరావాండ్లపల్లెలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 03:54 IST

గురుస్వామి (పాత చిత్రం)

చౌడేపల్లె: పంటకు నీరందించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వృద్ధ రైతు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పేరావాండ్లపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు కథనం మేరకు.. మండలంలోని పరికిదొన పంచాయతీ పేరావాండ్లపల్లెకు చెందిన గురుస్వామి(70)కి సమీపంలోనే కాగతివాని చెరువు కింద కొంత భూమి ఉంది. అక్కడ టమోటా మొక్కలు నాటేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలో నీరు పెట్టడానికి రైతు కుమారుడు వెంకటేష్‌తో కలిసి వెళ్లారు.అక్కడే నియంత్రిక నుంచి బోరు వరకు ఇచ్చిన కనెక్షన్‌ వైర్లు రక్షణ లేకుండా భూమిపై వేశారు. వైరుకున్న జాయింట్‌ తడవకుండా పాత గుడ్డను చుట్టూ ప్రయత్నం చేశాడు. వెంటనే విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు.  సమీపంలోనే ఉన్న కుమారుడు వెంకటేష్‌ అక్కడికి చేరుకుని వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని