logo

ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు: ఏఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ జగదీష్‌ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు.

Published : 21 Mar 2023 04:10 IST

బాధితులతో మాట్లాడుతున్న ఏఎస్పీ జగదీష్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ జగదీష్‌ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు. వీటిలో మోసాలు, వరకట్న వేధింపులు, వేధింపులు, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, భూ సమస్యలు, మోటారు వాహనాల దొంగతనాలపై ఫిర్యాదులు అందాయి. ఆపై పోలీసు అధికారులతో జూమ్‌ సమావేశం ద్వారా మాట్లాడారు. పోలీసు స్పందన ఫిర్యాదులపై నిర్లక్ష్యం ఉండరా దని చెప్పారు. వాటిని పరిష్కరించి వారం రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఏఎస్సై మాధవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు