logo

పకడ్బందీగా పశుసంతతి అభివృద్ధి పథకం అమలు

పక్కాగా పశుసంతతి అభివృద్ధి పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు.

Published : 22 Mar 2023 03:12 IST

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: పక్కాగా పశుసంతతి అభివృద్ధి పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. మంగళవారం స్థానిక పశుసంతతి అభివృద్ధి పథకం కార్యాలయంలో సూపర్‌వైజర్లు, గోపాలమిత్రలతో సమీక్షించారు. వెంకట్రావు మాట్లాడుతూ అత్యధిక పాల దిగుబడులిచ్చే జెర్సీ జాతి పశు సంతతి అభివృద్ధే పథకం లక్ష్యమన్నారు. మేలు జాతి పశుసంతతి అభివృద్ధికి జిల్లాలో ఐదేళ్ల ప్రణాళికతో పథకం అమలు చేస్తున్నామని..ప్రస్తుతం నాలుగేళ్లు పూర్తయిందన్నారు. జిల్లాలో ఐదేళ్ల కాలంలో 288 కోడె దూడల ఎంపిక లక్ష్యం కాగా...ఇప్పటి వరకు 140 కోడె దూడలను ఎంపిక చేశామన్నారు. డీఎల్‌డీఏ చైర్మన్‌ సంతోష్‌కుమార్‌. పీటీపీ డీడీ వాసు, ఏడీ అసీఫ్‌, పశుసంవర్ధక శాఖ డీడీలు ప్రభాకర్‌, బాలసుబ్రహ్మణ్యం, గోవిందయ్య పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు