logo

అమృత్‌ జలధారకు దరఖాస్తుల ఆహ్వానం

అమృత్‌ జలధార పథకానికి షెడ్యూల్డు కులాల్లోని అర్హులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 22 Mar 2023 03:12 IST

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అమృత్‌ జలధార పథకానికి షెడ్యూల్డు కులాల్లోని అర్హులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోరుబావి, మోటారు, డ్రిప్‌, స్ప్రింక్లర్లు ఇస్తారని, యూనిట్టు విలువలో 50 శాతం లేదా రూ.50 వేల వరకూ రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒకరు లేదా గ్రూపుగానూ ఉండవచ్చని, సంవత్సర ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పథకం కింద స్వయం ఉపాధి కోసం గొర్రెలు, పాడి గేదెల పెంపకం, ట్రాక్టరు, ప్యాసింజర్‌ వాహనం (కారు, వ్యాను), ఆటో మొబైల్‌ సర్వీసింగ్‌ యూనిట్‌, బ్యాటరీ యూనిట్‌, కొవ్వొత్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతు, కంప్యూటర్‌ సర్వీసింగ్‌తో పాటు ఇంకా వివిధ స్వయం ఉపాధి పనుల కోసం యూనిట్టు విలువలో 50 శాతం లేదా రూ.60 వేల వరకూ రాయితీతో రుణం మంజూరు చేయనున్నట్లు వివరించారు. రేషన్‌, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు పత్రం, మొబైల్‌ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం, భూమి పట్టాదార్‌ పాసుపుస్తకం, పాస్‌పోర్టు సైజు ఫొటోతో sbms.ncog.gov.in వెబ్‌సైట్‌లో బ్యాంకు పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

నెహ్రూ యువకేంద్రం ఖాళీలకు..

చిత్తూరు(క్రీడలు): నెహ్రూ యువ కేంద్ర (ఎన్‌వైకే)లో జాతీయ సేవా కార్యకర్తలుగా పనిచేసేందుకు ఆసక్తిగల యువత నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఎన్‌వైకే జిల్లా యువజన అధికారి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. అభ్యర్థుల వయస్సు 1-4-2023 నాటికి 18 నుంచి 29 ఏళ్లలోపు ఉండాలని, పదోతరగతి విద్యార్హత కలిగినవారు అర్హులన్నారు. ఎంపికైన సేవా కార్యకర్తలు గ్రామాల్లో యువజన, మహిళా మండలి స్థాపన, చైతన్య సదస్సుల్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 24 తేదీలోగా ఎన్‌వైకేఎస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని సమర్పించాలన్నారు. వివరాలకు 08572-241317 కార్యాలయ నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని