logo

తహసీల్దారు పార్వతి బదిలీ

చిత్తూరు గ్రామీణ తహసీల్దారు పార్వతిని కుప్పం మండలానికి బదిలీ చేస్తూ.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 22 Mar 2023 03:12 IST

చిత్తూరు గ్రామీణ : చిత్తూరు గ్రామీణ తహసీల్దారు పార్వతిని కుప్పం మండలానికి బదిలీ చేస్తూ.. జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరులో డీటీ కిరణ్‌కుమార్‌కు తహసీల్దార్‌గా అదనపు బాధ్యతులు అప్పగించారు. పార్వతి బదిలీ వెనుక అనేక ఆరోపణలున్నట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్‌ 28న చిత్తూరు తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన తొలి నుంచి ఆమె స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి కన్నుసన్నల్లోనే పని చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అనుకూలంగా పనిచేశారని విపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు