logo

నూతన ఆలోచనలకు కార్యరూపం

యువతలో ఉన్న నూతన ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీసుకురావడానికి ‘ప్రమోటింగ్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇండివిజువల్స్‌ స్టార్టప్స్‌ అండ్‌ ఎంఎస్‌ఎంఈ’ (ప్రిజం)...

Published : 22 Mar 2023 03:22 IST

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే: యువతలో ఉన్న నూతన ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీసుకురావడానికి ‘ప్రమోటింగ్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇండివిజువల్స్‌ స్టార్టప్స్‌ అండ్‌ ఎంఎస్‌ఎంఈ’ (ప్రిజం) వేదికగా పని చేస్తుందని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. వర్సిటీలో ఐదేళ్ల క్రితం డీఎస్‌ఐఆర్‌-ప్రిజం పథకం ప్రభావం, అధ్యయన నివేదికపై కార్యశాల నిర్వహించారు. వర్సిటీ సావేరి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి వీసీ ముఖ్య అతిథిగా విచ్చేసి సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం డీఎస్‌ఐఆర్‌ మెంబర్‌ సెక్రటరీ రామానుజ బెనర్జీ మాట్లాడుతూ యువత, నిపుణులు, రైతులు, గృహిణుల్లో ఉన్న నూతన వ్యాపార, వాణిజ్య ఆలోచనలు ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే ప్రిజం లక్ష్యమన్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఇన్నోవేటర్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. డీఎస్‌ఐఆర్‌ సంచాలకులు పీ.కే.దత్తా, డీఎస్టీ మాజీ కార్యదర్శి రామస్వామి, రీసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం డైరెక్టర్‌ జనరల్‌ ఆచార్య సచిన్‌ చతుర్వేది, మహిళా వర్సిటీ ప్రిజం ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఉమామహేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని