logo

స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్‌ కులాల వారికి అమ్రిత్‌ జల ధార స్కీమ్‌ (ఏజేఎస్‌), యంగ్‌ ఎంట్రెప్రెన్కూర్‌ స్కీమ్‌ (వైఈఎస్‌)...

Published : 22 Mar 2023 03:22 IST

తిరుపతి(రెవెన్యూ), న్యూస్‌టుడే: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్‌ కులాల వారికి అమ్రిత్‌ జల ధార స్కీమ్‌ (ఏజేఎస్‌), యంగ్‌ ఎంట్రెప్రెన్కూర్‌ స్కీమ్‌ (వైఈఎస్‌) పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ తిరుపతి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యు.నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏజేఎస్‌ పథకం ద్వారా బోరు బావి, బోరు మోటారు (సబ్‌ మెర్సిబుల్‌), డ్రిప్‌, స్ప్రింక్లర్‌ తదితర వాటికి యూనిట్‌ విలువపై 50 శాతం రాయితీ లేదా రూ.50 వేల వరకు రాయితీ మంజూరు చేయనున్నట్లు వివరించారు. వైఈఎస్‌ పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం ముర్రా జాతి గేదెలు (రెండు), గొర్రెల పెంపకం, మినీ డైరీ (పాడి గేదెల పెంపకం) గ్రూప్‌, ట్రాక్టర్‌ అండ్‌ ట్రైలర్‌, ప్యాసింజర్‌ వాహనం (కారు), ప్యాసింజర్‌ వాహనం (వ్యాను), ఆటో మొబైల్‌ సర్వీసింగ్‌ యూనిట్‌, బ్యాటరీ సర్వీసింగ్‌ యూనిట్‌, కొవ్వొత్తుల తయారీ, ఎంబ్రాయిడరీ అండ్‌ టైలరింగ్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ రిపేర్‌ సెంటర్‌, మట్టి ఇటుకల తయారీ, పచ్చళ్ల తయారీ వంటి వాటిపై 50 శాతం రాయితీ లేదా రూ.60 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో sbms.ncog.gov.in / banks portal ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని