logo

ఉచిత ప్రవేశాలకు నమోదు చేసుకోవాలి

విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి నమోదు చేసుకోవాలని డీఈవో డాక్టర్‌ వి.శేఖర్‌ తెలిపారు.

Published : 22 Mar 2023 03:22 IST

తిరుపతి(విద్య): విద్యాహక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి నమోదు చేసుకోవాలని డీఈవో డాక్టర్‌ వి.శేఖర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, నగర ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.1.40 లక్షలు ప్రాతిపదికన తీసుకుని వారి పిల్లలను అర్హులుగా నిర్ణయిస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు పాఠశాల యాజమాన్యాలు విద్యాశాఖ వెబ్‌సైట్ http:/// cse.ap.gov.in  ద్వారా ఏప్రిల్‌ 7వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని