logo

కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు

శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో బీఏ, బీకామ్‌ కోర్సు సప్లిమెంటరీ విద్యార్థులకు కామన్‌గా ఉండే ‘ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌’ పరీక్షను ఈనెల 28వ నిర్వహించాల్సి ఉండగా ఈనెల...

Published : 22 Mar 2023 03:22 IST

తిరుపతి(ఎస్వీయూ): శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో బీఏ, బీకామ్‌ కోర్సు సప్లిమెంటరీ విద్యార్థులకు కామన్‌గా ఉండే ‘ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌’ పరీక్షను ఈనెల 28వ నిర్వహించాల్సి ఉండగా ఈనెల 18వ తేదీనే పలు కళాశాలలు నిర్వహించిన నేపథ్యంలో వీసీ ఆచార్య రాజారెడ్డి కార్యాలయం కఠినచర్యల దిశగా ముందుకెళ్తోంది. తితిదేకు చెందిన శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాల, మరో రెండు ప్రైవేటు కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి, వారినుంచి సమాధానం రాగానే ప్రత్యేక కమిటీతో విచారణ చేసి చర్యలు తీసుకోనున్నట్లు వీసీ కార్యాలయం పేర్కొంది.

పరీక్షకు కొత్త ప్రశ్నపత్రం

బీఏ, బీకామ్‌ కామన్‌ ప్రశ్నపత్రమైన ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ పరీక్షకు కొత్త ప్రశ్నపత్రం ఇవ్వాలని వీసీ ఆదేశించారు. ఆయన సూచనతో నూతన ప్రశ్నపత్రాన్ని పరీక్షల కార్యాలయం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేరవేసిన ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ ప్రశ్నపత్రాన్ని తిరిగి ఎస్వీయూకు పంపాలని, కొత్త ప్రశ్నపత్రం అందజేస్తామని అన్ని పరీక్షల కేంద్రానికి ఎస్వీయూ సమాచారమిచ్చింది. ఈనెల 28వ తేదీన ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నూతన ప్రశ్నపత్రంతో పరీక్ష జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని