logo

ఆకట్టుకున్న ప్రాజెక్టు ఎక్స్‌పో

రాష్ట్ర ప్రభుత్వం, ప్రధమ్‌ సంస్థ సంయుక్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈఎండీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో విజయేంద్రరావు పరిశీలించారు.

Published : 22 Mar 2023 03:52 IST

ప్రాజెక్టు ఎక్స్‌పోను పరిశీలిస్తున్న డీఈవో విజయేంద్రరావు, పక్కన ఉపాధ్యాయులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం, ప్రధమ్‌ సంస్థ సంయుక్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈఎండీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో విజయేంద్రరావు పరిశీలించారు. జిల్లా స్థాయికి ఎంపికైన పది సైన్స్‌ ప్రాజెక్టులు మంగళవారం ప్రదర్శించారు. డీఈవో మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో సరికొత్త ప్రయోగాలకు విద్యార్థులు శ్రీకారం చుట్టాలని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకనుగుణంగా విద్య తీసుకురావాలన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి ఆర్‌వీ రమణ, ఈఎండీపీ జిల్లా మేనేజర్‌ అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు