logo

జిల్లా కేంద్రానికి చేరిన ‘పది’ ప్రశ్న పత్రాలు

ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు విజయవాడ నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహానంలో చిత్తూరుకు చేరాయి.

Published : 22 Mar 2023 03:52 IST

పదోతరగతి పరీక్షల ప్రశ్న పత్రాల తరలింపును పరిశీలిస్తున్న డీఆర్వో రాజశేఖర్‌, డీఈవో విజయేంద్రరావు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే : ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు విజయవాడ నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహానంలో చిత్తూరుకు చేరాయి. మంగళవారం ఉదయం సెటు-1 స్పెల్‌ -1 బండిళ్లు డీఆర్వో రాజశేఖర్‌ పర్యవేక్షణలో డీఈవో విజయేంద్రరావు, అధికారులు జిల్లావిద్యాశాఖ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. ప్రత్యేక వాహనంలో వచ్చిన ప్రశ్న పత్రాల బండిళ్లను పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం ఈ ప్రశ్న పత్రాలను 11రూట్లుల్లో పరీక్ష కేంద్రాల పరిధిలోని 33 పోలీసుస్టేషన్లకు తరలించి అక్కడ భద్రపరచారు. బుధ]వారం విజయవాడ నుంచి మరో సెటు-2 స్పెల్‌ 1 ప్రశ్న పత్రాలు రానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు