logo

విద్యుత్తు ప్రమాదాల అడ్డుకట్టకు చర్యలు: ఎస్‌ఈ

విద్యుత్తు ప్రమాదాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి సర్కిల్‌ విద్యుత్తు శాఖ ఎస్‌ఈ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 03:52 IST

బాలగంగనపల్లె: టవర్ల ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఈ కృష్ణారెడ్డి

చిత్తూరు(మిట్టూరు): విద్యుత్తు ప్రమాదాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి సర్కిల్‌ విద్యుత్తు శాఖ ఎస్‌ఈ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. గంగాధరనెల్లూరు, చిత్తూరు గ్రామీణ మండలాల్లో విద్యుత్తు ప్రమాదాల నివారణ, లో ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి రూ.కోటి నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. మంగళవారం ఆయన చిత్తూరు గ్రామీణ మండలం తాళంబేడులో లో ఓల్టేజి నివారణకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 11కేవీ విద్యుత్తు లైన్లు, చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు టవర్లను పరిశీలించి మాట్లాడారు. ఎస్‌ఎస్‌కొండ ఉప కేంద్రాన్ని పరిశీలించి.. నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు మూడు బ్రేకర్ల ఏర్పాటు నిమిత్తం రూ.25 లక్షలు మంజూరు చేశారు. 11కేవీ లైన్లు ఏర్పాటుకు రూ.30లక్షలు, లో ఓల్టేజీ సమస్య, అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు రూ.50లక్షలతో విద్యుత్తు లైన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. బాలగంగనపల్లెలో నూతన ఉప కేంద్రం ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపారు. డీఈఈ జ్ఞానేశ్వర్‌, ఏఈఈలు రాజా, సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని