logo

రాగిజావ బలవర్ధక ఆహారం

జగనన్న గోరుముద్దలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న రాగిజావ  బలవర్ధకమైన ఆహారమని కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు.

Published : 22 Mar 2023 03:52 IST

విద్యార్థులకు రాగిజావ అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు, కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  జగనన్న గోరుముద్దలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న రాగిజావ  బలవర్ధకమైన ఆహారమని కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. రాగిజావ పంపిణీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌ విధానంలో మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని 2,457 పాఠశాలల్లో చదువుతున్న 1.64 లక్షల మంది విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. నగర మేయర్‌ అముద, డీఈవో విజయేంద్రరావు, డీవైఈవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ అంశాలపై కలెక్టర్‌ సమీక్ష

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రెవెన్యూ అంశాల్లో పురోగతిపై కలెక్టర్‌ హరినారాయణన్‌ మంగళవారం సాయంత్రం ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్మశాన వాటికలకు స్థలాలు, అసైన్‌మెంట్‌ భూముల పంపిణీ ఏర్పాట్లను నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. భూసేకరణకు మంజూరైన నిధుల్ని 10 రోజుల్లో పంపిణీ చేయాలన్నారు. 766 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తికాగా, 284 గ్రామాలు ఓఆర్‌ఐ షీట్లు వచ్చాయన్నారు. జేసీ వెంకటేశ్వర్‌, డీఆర్‌వో రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని