logo

మాతృ మరణాల నివారణకు కృషి చేయండి

మాతా శిశు మరణాల నివారణకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యు.శ్రీహరి పిలుపునిచ్చారు.

Published : 22 Mar 2023 03:52 IST

వైద్యాధికారులతో సమీక్షిస్తున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీహరి

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: మాతా శిశు మరణాల నివారణకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యు.శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి జిల్లా కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగిన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో నాలుగు మాతృ మరణాలకు కారణాల గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నివారించేందుకు అందరూ దృష్టి సారించాలని సూచించారు. గ్రామ స్థాయి వైద్య సిబ్బంది రోగుల పరిస్థితుల మేరకు జిల్లా ఆస్పత్రులకు రెఫరల్‌ చేయాలని తెలిపారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రభావతి, నోడల్‌ ఆఫీసర్‌ శాంతకుమారి, వైద్యులు రాధ, అరుణ, ప్రసన్న ఠాగూర్‌, మాలతి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని