logo

‘రోడ్డును ఆక్రమించిన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి’

ఏర్పేడు మండలం చిందేపల్లె గ్రామసులు వినియోగిస్తున్న రోడ్డును లాంకో పరిశ్రమ ఆక్రమించుకుని రాకపోకలకు వీలులేకుండా చేస్తుందని...

Published : 22 Mar 2023 03:52 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న చిందేపల్లె రైతులు

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఏర్పేడు మండలం చిందేపల్లె గ్రామసులు వినియోగిస్తున్న రోడ్డును లాంకో పరిశ్రమ ఆక్రమించుకుని రాకపోకలకు వీలులేకుండా చేస్తుందని, ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్రామసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరిశ్రమల కోసం పొలాలు ఇచ్చిన రైతులకు రోడ్డులేకుండా చేయడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్‌ వెంకటరమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో నాయకులు వెంకయ్య, రంతయ్య, బాలకృష్ణ, గురవయ్య, పుణ్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని