logo

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

పోలీస్‌లు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.

Published : 22 Mar 2023 03:52 IST

ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు

పరిశీలిస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

ఏర్పేడు, న్యూస్‌టుడే: పోలీస్‌లు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో సకాలంలో దర్యాప్తుచేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రధాన రహదారి నిర్మాణం జరుగుతుండటంతో నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచూ వాహనాల తనిఖీలు చేపట్టి ఎర్రచందనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాన్ని అరికట్టాలని పేర్కొన్నారు. పాతనేరస్తులు, కేడీల కదలికపై ప్రత్యేక నిఘా ఉంచి నేర నివారణకు చర్యలు చేపట్టాలని వివరించారు. మండలంలో ఐఐటీ, ఐస్సెర్‌, అంతర్జాయ విమానాశ్రయం, పెద్దఎత్తున పరిశ్రమలు ఉండటంతో రహదారులపై నిరంతరం గస్తీ ఏర్పాటు చేసి ఆకతాయల ఆగడాలను అరికట్టాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ మేమున్నామనే భరోసాని నింపాలని పోలీస్‌లకు సూచించారు. చిన్నపాటి వివాదాలతో స్టేషన్‌కు వచ్చే ఇరు వర్గాల వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. మహిళలు, బాలికల హక్కులు, చట్టాలు గురించి అవగాహన కల్పించాలని మహిళా సంరక్షణ కార్యదర్శులకు వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రామచంద్ర, సీఐలు శ్రీహరి, చంద్రశేఖర్‌ పిళ్లై ఎస్సై రఫీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని