logo

శ్రీసిటీని సందర్శించిన సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌

చెన్నైలోని సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గార్‌ పాంగ్‌ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. స్థానిక వాణిజ్య కేంద్ర భవనంలో శ్రీసిటీ ఎండీ డా.రవీంద్రసన్నారెడ్డి ఆయనకు స్వాగతం...

Published : 22 Mar 2023 03:52 IST

సింగపూర్‌ కాన్సుల్‌జనరల్‌, ప్రతినిధుల బృందానికి శ్రీసిటీ గురించి వివరిస్తున్న రవీంద్రసన్నారెడ్డి

శ్రీసిటీ(వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: చెన్నైలోని సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గార్‌ పాంగ్‌ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. స్థానిక వాణిజ్య కేంద్ర భవనంలో శ్రీసిటీ ఎండీ డా.రవీంద్రసన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికి భౌగోళిక నమూనా పటం ద్వారా పారిశ్రామికవాడ ప్రత్యేకతలు, ప్రగతి వివరాలు, ఇక్కడి హరితహిత చర్యలు వంటి అనేక అంశాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎడ్గార్‌ పాంగ్‌ మాట్లాడుతూ శ్రీసిటీలోని వ్యాపార అనుకూలపరిస్థితులు, సదుపాయాల కారణంగా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దిన యాజమాన్య కృషిని ప్రశంసించారు.అనంతరం శ్రీసిటీ ఎండీ, అధికారులతో చర్చించారు.రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్‌)లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామిగా సింగపూర్‌ ఎదుగుతున్న నేపథ్యంలో కాన్సుల్‌ జనరల్‌ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులు రావడానికి మార్గం సుగమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంటర్‌ప్రైజ్‌ సింగపూర్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ శబరీష్‌ నాయర్‌తో సహా ఇతర అధికారుల బృందంతో కలిసి పర్యటనకు వచ్చిన కాన్సుల్‌ జనరల్‌ తన పర్యటనలో భాగంగా శ్రీసిటీలోని సింగపూర్‌నకు చెందిన వైటల్‌ పేపర్‌ పరిశ్రమను సందర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు