logo

‘ప్రభుత్వ పాఠశాలలో చదవడం గర్వకారణం’

పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడాన్ని చులకనగా భావించేవారని.. నేడు గర్వంగా భావిస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

Published : 22 Mar 2023 03:56 IST

విద్యార్థినికి రాగిజావ తాగిస్తున్న మంత్రి ఆర్‌కే రోజా, పక్కన కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడాన్ని చులకనగా భావించేవారని.. నేడు గర్వంగా భావిస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లె నుంచి విద్యార్థులకు రాగిజావా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా... కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని 22,999 పాఠశాలల్లో 1,55,577 మంది పిల్లలకు వారంలో మూడు రోజులు జావ అందిస్తామన్నారు. డీఈవో శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని