డ్రైవర్లు లేక.. బస్సులు తిరగక
ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సుల నుంచి ఊహించిన మేర ఫలితాలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిపోలోనే విద్యుత్తు ఏసీ బస్సులు
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సుల నుంచి ఊహించిన మేర ఫలితాలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్యం మేరకు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నా వాటిని నడిపే డ్రైవర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 100 బస్సులకు గానూ ఇప్పటి వరకు మొత్తం 82 అలిపిరి డిపోకు చేరుకోగా మిగిలినవి నెలాఖరులోపు చేరుకోనున్నాయి. ప్రస్తుతం 50 తిరుమల-తిరుపతి కనుమ దారిలో, 14 బస్సులు రేణిగుంట విమానాశ్రయం- తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. మిగిలిన బస్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డ్రైవర్ల కొరత కారణంగా రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అవి డిపోకే పరిమితమయ్యాయి. బస్సుల నిర్వహణ, డ్రైవర్ల నియామకం ఇతర పనులన్నీ గుత్తేదారు సంస్థే చేసుకోవాలన్న నిబంధనలు ఉండటంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యుత్తు బస్సులు నడపడానికి హెవీ లైసెన్సు పొంది ఒక ఏడాది అనుభవమున్న డ్రైవర్లు అర్హులు. మొదట్లో వచ్చిన బస్సులకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణత సాధించి అర్హులైన వారిని గుత్తేదారు సంస్థ నియమించుకుంది. వారికి రోజుకు రూ.633 చొప్పున నెలకు రూ.19 వేలు ఇచ్చేవారు. ఆ వేతనంతో వారు రోజుకు తిరుపతి- తిరుమల కనుమదారిలో మూడు రౌండ్ ట్రిప్పులు వేయాల్సి ఉంది. రూ.633 రోజువారీ వేతనంలోనే మూడు పూటలా భోజనానికి పోనూ మిగిలేది లేకపోవడంతో నిరసనలు తెలిపిన సందర్భాలున్నాయి. దీంతో జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్ రెడ్డి జోక్యం చేసుకుని వేతనాల పెంపునకు గుత్తేదారు సంస్థతో చర్చించారు. ప్రస్తుతం రోజుకు రూ.767 చొప్పున నెలకు రూ.23 వేలు చెల్లిస్తున్నారు. రోజుకు మూడు ట్రిప్పులు కాకుండా ఐదు ట్రిప్పులు వేయాల్సి ఉంది. దీంతో ఒక పగలు, ఒక రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ట్రావెల్స్ వాహనాలకు డ్రైవర్ల డిమాండు అధికంగా ఉండటంతో పాటు భోజనం కాకుండా రోజుకు రూ.900 వరకు వచ్చే అవకాశం ఉండటంతో నడపటానికి డ్రైవర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?
-
India News
Rahul Gandhi: రాహుల్ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్చల్..
-
General News
Registrations: తెలంగాణలో నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు
-
India News
గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు ₹లక్ష కోట్లు.. కేబినెట్ ఆమోదం
-
Politics News
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్