logo

ఆ భూములు తుడావే..!

ముప్ఫై ఏళ్లు పోరాటం చేసిన తుడా అధికారులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. వేదాంతపురంలో సేకరించిన భూములు తుడావే అంటూ కోర్టు తీర్పు వెలువరించింది.

Published : 24 Mar 2023 01:25 IST

వేదాంతపురం కేసులో న్యాయస్థానం తీర్పు

ఈనాడు-తిరుపతి: ముప్ఫై ఏళ్లు పోరాటం చేసిన తుడా అధికారులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. వేదాంతపురంలో సేకరించిన భూములు తుడావే అంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పుడా భూమిని అభివృద్ధి చేయడంతో పాటు బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి ప్రజలకు విక్రయించేందుకు యోచిస్తున్నారు. తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం పరిధిలో సుమారు 25.22 ఎకరాల పట్టా భూమిని ‘సైట్స్‌ అండ్‌ సర్వీసెస్‌’ కింద భూసేకరణ చేసేందుకు 1992లో తుడా అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనికి అనుగుణంగా 1993లో 13.26 ఎకరాలకు మాత్రమే అవార్డు జారీ చేయగా.. మిగిలిన 11.96 ఎకరాలకు సంబంధించి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.చివరకు తుడాకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని