logo

చామల బీటు అధికారి సస్పెన్షన్‌

విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఇతర అభియోగాల నేపథ్యంలో చామల బీటు అధికారి సురేష్‌ను డీఎఫ్‌వో జి.సతీష్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

Published : 24 Mar 2023 01:25 IST

జీవకోన(తిరుపతి): విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఇతర అభియోగాల నేపథ్యంలో చామల బీటు అధికారి సురేష్‌ను డీఎఫ్‌వో జి.సతీష్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. ఈనెల 6న సస్పెండ్‌ చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమీప బంధువులే స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఉంటే సహకరించాడని తేలడంతోనే సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.  డీఎఫ్‌వో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఎఫ్‌బీవోపై వచ్చిన అభియోగాలు  వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని