logo

టూరిస్ట్‌ బస్టాండ్‌ వేలంలో రూ.2.55 కోట్ల ఆదాయం

తిరుచానూరు టూరిస్ట్‌ బస్టాండ్‌ వేలం ద్వారా పంచాయతీకి రూ.2.55 కోట్లు ఆదాయం లభించింది. గురువారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచి కె.రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు.

Published : 24 Mar 2023 01:25 IST

తిరుచానూరు: తిరుచానూరు టూరిస్ట్‌ బస్టాండ్‌ వేలం ద్వారా పంచాయతీకి రూ.2.55 కోట్లు ఆదాయం లభించింది. గురువారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచి కె.రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. పంచాయతీ ప్రారంభ ధరగా రూ.2.27 కోట్లు నిర్ణయించి వేలం ప్రారంభించారు. వేలం దక్కించుకునేందుకు తిరుచానూరుకు చెందిన దేవేంద్రరెడ్డి, దామినేడుకు చెందిన నాగిరెడ్డి పోటీ పడ్డారు. చివరకు నాగిరెడ్డి అత్యధికంగా రూ.2.55 కోట్లు పాడి వేలాన్ని దక్కించుకున్నారు. పంచాయతీ దుకాణాలకు సంబంధించి వేలం నిర్వహించగా పోటీదారులు ముందుకు రాకపోవడంతో రద్దు చేసినట్లు ఈవోపీఆర్డీ నీలంకంఠేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని