logo

పెనుగాలుల వర్షంతో బీభత్సం

అల్పపీడన ప్రభావంతో గురువారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Published : 24 Mar 2023 02:09 IST

ఎల్‌బీపురంలో నేల కూలిన కొబ్బరి చెట్టు

చిత్తూరు(వ్యవసాయం): అల్పపీడన ప్రభావంతో గురువారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడి, వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరు గ్రామీణ, గుడిపాల, పాలసముద్రం, గంగాధర నెల్లూరు తదితర మండలాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షం కురిసింది. చిత్తూరు గ్రామీణ, పాలసముద్రం తదితర మండలాల్లో స్తంభాలు నేల కూలి, లైన్లు తెగిపోవడంతో కొంత సేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు నగరం ఎల్‌బీపురంలో ఆరు కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు