logo

డీఆర్‌డీవో ప్రాజెక్టుకు స్థలాల్ని అప్పగించాలి

జిల్లాలో ఏర్పాటవుతున్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రాజెక్టు కోసం రహదారి నిర్మాణం నిమిత్తం సేకరించిన భూముల్ని జూన్‌ ఒకటి నాటికి అప్పగించాలని జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

Published : 24 Mar 2023 02:09 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఏర్పాటవుతున్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రాజెక్టు కోసం రహదారి నిర్మాణం నిమిత్తం సేకరించిన భూముల్ని జూన్‌ ఒకటి నాటికి అప్పగించాలని జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. రెవెన్యూ, ర.భ.శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో గురువారం ఆయన మాట్లాడారు. చిత్తూరు-తచ్చూరు హైవే నుంచి డీఆర్‌డీవో ప్రాజెక్టు వరకు నూతన రోడ్డు నిర్మాణం జరగనుందన్నారు. భూసేకరణ పూర్తికాగానే రోడ్డు పనుల్ని ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. శిక్షణ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, డీఆర్‌డీవో అధికారి హేమరాజ్‌ శర్మ పాల్గొన్నారు.

* లేరు-కాలూరు (ఎన్‌హెచ్‌ 71) రహదారి పనుల్లో భాగంగా రొంపిచెర్ల మండలంలోని బొంబాయి గారిపల్లె, బండకిందపల్లె, పెద్దగొట్టుగల్లు, సదుం మండలంలో ఊటుపల్లెలో భూసేకరణ పూర్తిచేయాలని జేసీ ఆదేశించారు. ఆర్డీవో రేణుక, సెక్షన్‌ సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, మురళి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

* త్తూరు-తచ్చూరు హైవే నిర్మాణంలో ఆటంకాలు లేకుండా చిత్తూరు, జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, నగరి, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలని జేసీ వెంకటేశ్వర్‌ సూచించారు.

* స్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. జేసీ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని