logo

సంస్కృతాంధ్ర భాషలకు సముద్రాల ఎనలేని సేవలు

సంస్కృతాంధ్ర భాషలకు డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య ఎనలేని సేవలు చేశారని తితిదే మాజీ ఈవో పి.కృష్ణయ్య, అమరరాజ సంస్థ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ పేర్కొన్నారు.

Updated : 24 Mar 2023 03:53 IST

మహామనిషి మధుర స్మృతులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్య అతిథులు

తిరుపతి(తాతయ్యగుంట), న్యూస్‌టడే: సంస్కృతాంధ్ర భాషలకు డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య ఎనలేని సేవలు చేశారని తితిదే మాజీ ఈవో పి.కృష్ణయ్య, అమరరాజ సంస్థ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ పేర్కొన్నారు. సముద్రాల సంస్మరణ సభ గురువారం నగరంలోని ఎన్జీవో కాలనీ వద్ద ఉన్న అరబిందో సొసైటీలో జరిగింది. వారు మాట్లాడుతూ ఆరు శతాబ్దాలకు పైగా తితిదేకి సేవలు అందించిన సముద్రాల ఎన్నో గ్రంథాలను వెలువరించడంతో పాటు అనేక ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారని కొనియాడారు. సముద్రాల ఆశయాలను నేటి తరం పరిశోధకులు, రచయితలు, విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మహామనిషి మధుర స్మృతులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సముద్రాల సతీమణి అంజనమ్మ, తనయుడు విజయానంద్‌, శతావధాని ఆముదాల మురళి, రచయితలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు