logo

ఆగిన పనులు.. విద్యార్థులకు ఇక్కట్లు

చిత్తూరు శివారు ఎం.అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిది నెలల కిందట రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభించారు.

Published : 24 Mar 2023 02:09 IST

తరగతి గదిలో విద్యార్థుల మధ్య పడేసిన ఇసుక బస్తాలు

ఈనాడు-చిత్తూరు: చిత్తూరు శివారు ఎం.అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిది నెలల కిందట రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభించారు. మూడు నూతన గదుల నిర్మాణం సహా పాత గదులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. గదుల నిర్మాణం పునాది దశలో నిలిచింది. పాత తరగతి గదుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి. వాటి మధ్యే విద్యార్థులు ఇబ్బందిగా పాఠాలు వింటున్నారు. ప్రాంగణంలో తొలగించిన బండల స్థానంలో కొత్తవాటిని వేయలేదు. గదుల నిర్మాణానికి తీసిన పునాది గోతులు.. అటు తరగతి గదుల వద్ద, ఇటు వంటగది వద్ద ప్రమాదకరంగా మారాయి. దాదాపు 125 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరగతి గదుల వద్ద ప్రమాదకరంగా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని