logo

‘అటవీ ప్రాంతంలో ఎందుకు ఉన్నారు?’

ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా యానాదులు ఎందుకు అటవీ ప్రాంతంలోనే ఉన్నారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌ ప్రశ్నించారు.

Published : 24 Mar 2023 02:09 IST

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌

గుడిపాల: ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా యానాదులు ఎందుకు అటవీ ప్రాంతంలోనే ఉన్నారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌ ప్రశ్నించారు. మండలంలోని చిత్తపార పంచాయతీ రాయల్‌చేను ఎస్టీ కాలనీలో సెడ్స్‌ సేవాసంస్థ నిర్వాహకురాలు రమాదేవి ఆధ్వర్యంలో గురువారం యానాదులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏవైనా అరోగ్య సమస్యలు ఉన్నాయా, రెవెన్యూ అధికారులు ఇళ్లస్థలాలు ఇచ్చారా? ఇస్తే ఎందుకు ఇళ్లు నిర్మించుకోలేదని ప్రశ్నించారు. అందరికీ రేషన్‌ కార్డులు, పింఛన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎస్టీల భూములకు ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సీడీపీవో సుగుణకుమారి, తహసీల్దార్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌, ఎంపీడీవో ఉపేంద్ర, ఏఎస్సై ముని వేలు, భాజపా మండల అధ్యక్షుడు సోమనాథ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని