logo

స్వచ్ఛందంగా తొలగించాలి

రోడ్లు ఆక్రమించి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారు స్వచ్ఛందంగా తొలగించా లని, లేదంటే తామే తొలగిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 24 Mar 2023 02:09 IST

దుకాణం తొలగించాలని చెబుతున్న కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి

పుత్తూరు: రోడ్లు ఆక్రమించి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారు స్వచ్ఛందంగా తొలగించా లని, లేదంటే తామే తొలగిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం తిరుపతి-అరక్కోణ రోడ్డు, కార్వేటినగరం మార్గాల్లో .. రోడ్డు ఆక్రమించి తాత్కాలిక షెడ్లు వేసిన వాటిని, రేకులను తొలగించారు. హాటల్స్‌లో నిల్వ ఉంచిన ఆహారం అందిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రతి హాటల్‌లో పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ ఇన్‌స్ప్పెక్టర్‌ నంబర్లు ఉంచకుంటే లైసెన్సు రద్దు చేస్తామన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మోతీలాల్‌, విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని